Wednesday, May 12, 2010

మా నాన్నారు........శ్రీ రామచంద్ర మూర్తి

పేరుకు తగ్గట్టుగా మా నాన్నగారు శ్రీరాముడు. సకల సద్గుణాల రాముడాయన. పుట్టింది పునర్వసు నక్షత్రంలో అని ఆ పేరు పెట్టారు . పేరుకే వన్నె తెచ్చారు నాన్నగారు .
నాన్నగారు పుట్టింది ,పెరిగింది కోనసీమలో. నాకు అంత బాగా ఆయన బాల్యం గురించి తెలియదు ఎవరిని నేను అడగలేదు ఎందుకో ఈ బ్లాగ్ చివర్లో మీకే తెలుస్తుంది . నాన్నగారికి మెడిసిన్ చదివి డాక్టర్ గ పేరు తెచ్చుకోవాలని చాల ఆశలు ఉండేవి. కాని నానమ్మ వాళ్లకి తొమ్మిది మంది పిల్లలు అందరిని చదివిన్చలేమని చెప్పారుట . అంతే నాన్న ఆశలమీద అలా నీళ్ళు జల్లారు. ఇక నాన్నగారు బోటనీ లో డిగ్రీలు చేసి కప్పల్ని ,బల్లులని కోస్తూ సరదా తీర్చుకున్నారుట. అసలు తాతగారికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది కప్పల్ని కోయడంలో కాదండి బాబు ఆస్థి విషయంలో . మా తాతగారికి ,దాయాదులకి ఆస్తి విషయంలో గొడవలోచ్చి కోర్ట్ లో కేసారు. ఆస్తంతా నాకే వస్తుందిలే అని మా తాతగారు గుండెల మీద చెయ్యేసుకుని వచ్చిన గవర్నమెంట్ జాబు కూడా వద్దనేసారటఅంతే కాకుండా చల్ మోహన రంగ అని గుర్రం బండి ఎక్కి ఊరంతా షికారు చేసేవారట . మీకు స్టొరీ ఎండింగ్ తెలిసిపొఇ నట్టుంది . అంతే మరి గుర్రంబండి తాతగారికి, ఆస్తంతా దాయాదులకి వెళ్ళింది . సో కథ లో నీతి ఏమిటంటే ఆస్తులు చూసుకుని ఉద్యోగాలు వదలకూడదు. పాపం బ్రతికి ఉన్నన్నాళ్ళు మా నానమ్మ దేప్పుతునే ఉండేది గుర్రంబండి ఉంటె చాలు అనుకున్నావు ఉద్యోగం వదిలేసావు అంటూ . కోడళ్ళు ,మనవాళ్ళు అంతా చాటుగా నవ్వుకునేవాళ్ళు . ఐన మా తాతగారికి అదంతా పెద్ద పట్టించుకునే టైపు కాదు . అయన రూటే సెపరేటు.
అసలాయన మాట్లాడితే కొడుకులకి తప్ప ఎవరికి అర్ధం కాదు . ఇంగ్లీష్ సినిమాలో ల గోనుక్కుంటారు అది ఒక కారణం ఐతే రెండవ కారణం ఇప్పుడు సంబాషణ చూసి తెలుసుకోవలసిందే
తాతగారు : రామయ్య గేదేకి గడ్డి పెట్టావా ?
నాన్నగారు : ఆ పెట్టానండి
తాతగారు: ఆ కృష్ణ మూర్తి కొడుకు బాగా చదువుకున్నడుర , రాత్రి అస్సలు బాగా మాట్లాడలేదనుకో నాకు ఒక్క ముక్క అర్ధం కాలేదు నీకు అర్ధం ఐంద ,,పొలానికి నీరు పెట్టమంటే వాడు చుట్ట తాగుతూ నిలబడ్డాడు .
ఈ మూడు ముక్కలు కృష్ణ మూర్తి కొడుకు గురించి అనుకుంటే మీరు వేడి ముద్దపప్పు+ నెయ్యిలో కాలు వేసినట్లే .( కొంచం ఎక్కువ జారతారని ) . రాత్రి అస్సలు బాగా మాట్లాడలేదన్నది టీవిలో న్యూస్ రీడర్ గురించి పొలానికి నీరు పాలేరు గురించి ఇంత జంపు బాష ఎవరికి ఉండదు . అసలు అయన భాష ఇంకా కష్టంగా ఉండేది కాని కొడుకులు ఏ రోజు విసుక్కోలేదు .
మా అమ్మాయికి ఏ విషయమైన చెప్పాలంటే తెలుగు ,ఇంగ్లీష్ రెండు కలిపి కొత్త భాష తయారు చేసి మరి చక్కగా చెప్తానా అంత వినేసి యు నో నొథింగ్ మమ్మీ అనేస్తుంది . కాలం మారింది ఎంత మారిందంటే తల్లితండ్రులలో చిన్న లోపాలు కూడా భరించలేనంత విసుగు , వాళ్ళకి చిన్న సహాయం కావాలంటే చేయలేను అంత విసుగు .
అలా మా తాతగారి కి మిగిలిన పొలం తో పులగం వందదానికే సరిపోదు అనేసారు . అంతే కాకుండా ఒక కండిషన్ పెట్టారు . ఎవరిదో ఈ బృహత్తర ఆలోచన నాకు తెలియదు కాని నాకు బాగా నచ్చింది ఈ పథకం . ఉన్నది ఏడుగురు అన్నదమ్ములు (వేటకి వెళ్ళలేదు కాని ) అన్నల సాయం తో తమ్ముళ్ళు చదువుకోవాలని , ఆ తర్వాతా ఉద్యోగాలు రాగానే కొంత మనీ తిరిగి ఇవ్వాలని. అలాగే మా నాన్నగారు కూడా అన్నయ్య సహాయంతో చదువుకుని ఇద్దరు తమ్ముళ్ళని చదివించారు .
ఇక ఉద్యోగాల వేటలో పడ్డారు . ఆ రోజుల్లో గవర్నమెంట్ జాబు అంటే పీనట్ పొట్లం కొనుక్కున్నట్లే . ఉద్యోగం వచ్చింది కాని పోస్టింగ్ ఆర్డర్ చూసి కళ్ళు తిరిగినంత పనైందట . కంట నీరు కూడా పెట్టుకున్నారుట (అలా అని అమ్మ చెప్పింది) విషయం ఏమిటంటే ఉద్యోగం వచ్చింది మంచిదే కాని వచ్చిన ఊరు ఒక అడవి లాంటిది పేరు అడ్డతీగల . ఆ పేరు పలికి వెనకాల ఇళయరాజా , రెహ్మాన్ మ్యూజిక్ లన్ని కలిపి పెట్టేసుకుంటే అదిరిపోతుంది . పేరులాగే ఊరు కూడా సూపర్ . అందరూ భయపెట్టారు పులులు ఎంటర్ అవ్వగానే హాయ్ చెప్తాయి అని పాములు మార్నింగ్ వాక్ కి , ఎలుగులు ఎవెనింగ్ వాక్ కి వస్తాయని . కాని ఏమి చేస్తారు ఇంట్లో అసలే ఒకసారి జాబు వదిలేసుకున్న చరిత్ర ఉందిగా మా నానమ్మ తిట్టి మరీ పంపించింది . ఆ తర్వాత తర్వాత ఆ ఊరంటే నాన్నగారికి చాల ఇష్టం ఏర్పడి అక్కడే ఉన్దిపోయరనుకోండి అది వేరే విషయం .
ఇక రేపు శ్రీరామ కళ్యాణం అదే మా నాన్నగారి పెళ్లి , ఆ ఊరితో అనుబంధం గురించి రాస్తాను .... అసలే నాకు ఓపిక తక్కువ , ఐడియాలు ఎక్కువ మరి ఉంటా శలవు ............

3 comments:

  1. Ha haha.. నేను కూడా మీ లాగే .. ప్రాజెక్ట్ లో జాయిన్ అయిన మొదట బోలెడంత పని వుంటది.. తర్వాత మొత్తం ఖాళీ .. the same pattern is repeating in my career.. :-)

    ReplyDelete
  2. బాగా రాసారు ..శైలి నచ్చింది .. కంటిన్యూ ..కంటిన్యూ :)

    ReplyDelete
  3. chalabagaa nachi mee sahithyaniki vandanam chapalli anipisthundhi

    ReplyDelete