సోఫాలో తీరికగా చిప్స్ తింటూ టీవీ చూస్తుంటే హటాత్తుగా ఎందుకు ఇలా బ్లాగు రాయకూడదు అనిపించింది . ఓహో మరి బిజీ లైఫ్ టైటిల్ ఏంటి అనుకుంటున్నారా ? అదే రాస్తున్నా ...
చిన్నప్పటినించి నేనొక కల కనేదాన్ని ( అచ్చం వెంకటేష్ నువ్వు నాకు నచ్చావు సినిమాలోల ) అదేమిటంటే నేను పెద్దదాన్ని అయ్యాక బాగా బిజీగా ఉండాలని నా కల అర్ధం కాలేదా ? నేను పెద్ద ఆఫీసుర్ని ఐ రెండు చేతులతో బిజీ బిజీగా సంతకాలు పెడుతుంటే , ఒక పక్కనించి ఫోన్ లు ఎడా పెడా మోగుతుంటే చేతులు ఖాళి లేక సతమతమవుతు ఇలా ఇలా సాగిపోయేది నా కల.....
కట్ చేస్తే నేనేమో వానాకాలం చదువులు చదివి కాలేజీ టైం నించి ఖాళిగా ఉన్నాను . ఎంసెట్, ఆసేట్ లు రాయకుండా సోఫాసేట్ లో కూర్చుని అమ్మ వండిపెడితే తినేదాన్ని. అలా ఇంట ,బయట ఖాళి....
ఎవరైనా ఊపిరి తీసుకోవడానికి కూడా ఖాళి లేదంటారా ఒక్కసారి వాళ్ళని చూస్తే చాల అసూయగా అనిపిస్తుంది కొంచం మీ బిజీ నాకు ఇద్దురు అనాలనిపిస్తుంది . పోనిలే పెళ్ళయ్యాక అన్నా బిజీగ అవుతాను అనుకుంటే మరీ తీరుబడిగా ఉంది . సరే ఈ జీవితం సోఫాలకే అంకితం అని పాడేయకుండా ఉద్యోగంలో చేరాను . ఒక పెద్ద IT కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఉజ్జోగం తస్సాదియ్యా ఇప్పటికైనా ఇల్లాలిగా ,ఉద్యోగినిగా బిజీ అయిపోతానని నా ఆశ. కాని నా ఆశలన్నీ ట్విన్ టవర్స్ లా కుప్ప కూలిపోతాయని ఊహించలేదు . ఆ ప్రాజెక్ట్లో పని లేదు ఎంత లేదంటే నా ప్రాజెక్ట్ mate హీరోయిన్ నమిత ఫోటోని గంటల తరబడి చూస్తూ గడిపేస్తే , నేను బాపు బొమ్మలతో కళాపోషణ చేసేదాన్ని . నెలకొకసారి వర్క్ వచ్చేది అప్పుడే సంక్రాంతి, దసరా అన్నమాట. దీనికి తోడూ onsite లోనే సగం వర్క్ అంతా అయిపోతుంది . మాకు వర్క్ పంపించే అయన దయామయుడు ,కరుణామయుడు అన్నమాట . కథ కంచికి మనం ఇంటికి నేను ఆ కంపెనీ వదిలేసి అమెరికా మా వారితో వచ్చేసినా నా collegue ఇంకా అదే ప్రాజెక్ట్ లో ఉంది ఎంజాయ్ చేస్తూ ఉంటాడు .
ఇండియాలో ఉంటే వచ్చేపోయే బంధువులతో, మరి ఇక మద్రాస్ లో ఉంటే వచ్చిరాని తమిళ్ తో నేను మాట్లాడితే ఓపికగా వినే కూరలవాళ్ళు ,పాలవాళ్ళు ఇలా చక్కగా టైం గడచి పోతుంది . కాని మా వారు అమెరికా తీసుకొచ్చి ట్టాట్ వీల్లేదు నీ గోళ్ళు నువ్వే కొరుక్కో అన్నారు . అదండీ సంగతి ఏమి చేస్తాం ... నాకేమో చక్కగా ఏ హైదరాబాద్ మహానగరంలో ఐన ఉండి పొద్దున్నే ఆదరాబాదరాగ లేచి అందరికి అన్ని బాక్సులు సర్దేసి, బట్టలు ఐరన్ చేస్తూ, ఒక వైపు టిఫిన్లు పెడుతూ , పనివాళ్ళతో యుద్ధం చేస్తూ టైం తో పరుగులు తీస్తూ అష్టావధానం చెయ్యాలని నా కోరిక . రాకెట్ కన్నా వేగంగా పరుగులు తీసే సిటీ బస్లలో జిమ్నాస్టిక్స్ చేస్తూ , ఇంటికొచ్చి పడి ఊపిరి తీసుకోవడానికి కూడా టైం చూసుకోవాలని నా కోరిక .
హే భగవాన్ ఎప్పుడు నేను బిజీగ ఉంటానో కదా ...అందుకే మా పిల్లల్ని చూస్తే తెగ ముద్దు వచ్చేస్తుంది నాకు ఈ ప్రపంచంలో నన్ను బిజీగా ఉంచేది వాళ్లిద్దరే .
Subscribe to:
Post Comments (Atom)
:-) బాగుంది శిరీష గారు :-) ఇద్దరు పిల్లలతో కూడా ఖాళీ ఉంటుందంటే మీ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ బాగుండి ఉంటాయ్ :-) ఇకనేం మరి బోల్డన్ని మంచి మంచి టపాలతో బ్లాగరులకు విందు చేసేయండి.
ReplyDeleteఅన్నట్లు మీ బ్లాగ్ ను కూడలి లాంటి ఎగ్రిగేటర్ లలో కలిపారా. నా బ్లాగ్ లో వాటికి సంభందించిన లింక్ లు ఉంటాయి. ఆయా ఎగ్రిగేటర్ కి వెళ్తే మీ బ్లాగ్ కలపండి అని లింక్ ఉంటుంది దాని ద్వారా కలిపేయండి.
వేణు జీ మీకు నా ధన్యవాదాలు . చాలా మంది అడుగుతారు ఇద్దరి పిల్లలతో కష్టమని ( ఒకప్పుడు పదిమందితో అనేవారు పూర్తిగా ట్రెండ్ మారినదిగా) అవును కాని చిన్న చిట్కా ఉంది వాళ్ళు ఎలాగు మన మాట వినరు అందుకే నేనే వాళ్ళ మాట వినేస్తాను అంతే ఖేల్ కథం దుకాన్ బంద్ :)
ReplyDeleteహహ ఈ రోజు నుండి నేను మీ శిష్యురాలిగా చేరిపోవాలని అనుకుంటున్నా .. ఏమంటారు గురువుగారు.. పని లేదని బాధా ..హతవిధి :)
ReplyDeleteనేను కూడా ఇలాగే అనుకునేదాన్ని,బ్లాగింగ్ అలవాటయ్యాక చదవడానికే టైమ్ సరిపోవటం లేదు,రాయడానికి తీరిక లేదు.
ReplyDeleteనేస్తం , మీ బ్లాగ్స్ చదివి మీకు నేను పెద్ద ఫ్యాన్ ఐపోయాను . రోజు కచ్చితంగా మీ బ్లాగ్స్ చదవనిదే నిద్రపోను . ఆసాంతం నవ్విస్తారు మీరు . మీరు నా బ్లాగ్ చదివి కామేన్టడం నా లక్ . ఇక నా విషయానికి వస్తే మరీ అంత ఖాలిగా కనిపిస్తే పని కూడా ఎవరు చెప్తారు మరి :)
ReplyDeleteనీహారిక , నాకు మొదట ఆ పేరు పెడదామని అనుకున్నారు ఇంట్లో . ఆ తర్వాత నించి ఆ పేరుకు నేను ఫ్యాన్ ని . తర్వాత మా అమ్మని చాల రోజులు బుర్ర తిన్న ఎందుకు ఆ పేరు పెట్టలేదని. ఆ పేరుకు అర్ధం మంచు బిందువు అని కదా (నాకు తెలిసి) . మీరన్నట్లు నేను కూడా బిజీ బ్లాగ్ మొదలుపెట్టి కాని నాకున్న శాపం తెలుసు కదా అందుకే ఇంటర్నెట్ ఫుల్ గ డౌన్ ఇంకేమి రాస్తాను ఇంకేమి చదువుతాను:)